బాలీవుడ్ లో స్టార్ హీరోలు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టడం అనేది రేర్ ఫీట్. ప్రయోగాలు ఎన్ని చేసినా ఎప్పుడో ఒకప్పుడు బోల్తా పడుతూనే ఉన్నారు. కానీ అక్షయ్ కుమార్ మాత్రం గ్యాప్ లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్స్ అందుకుంటున్నాడు. స్టోరీ సెలక్షన్ లోనే జనాలను ఆకర్షిస్తున్న ఈ సీనియర్ యాక్టర్ ఎయిర్ లిఫ్ట్ సినిమా నుంచి మినిమమ్ 100కోట్ల కలెక్షన్స్ తో హిట్స్ అందుకుంటున్నాడు.

 రుస్తోమ్ - జాలి LLB 2 - కేసరి సినిమాలతో వరుసగా తన బాక్స్ ఆఫీస్ రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే వరుసగా హిట్స్ రావడంతో హౌజ్ ఫుల్ 4 సినిమాతో కాస్త తడబడినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ సినిమా విడుదలైన రోజే నెగిటివ్ కామెంట్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. బాలీవుడ్ సీనియర్ క్రిటిక్స్ అయితే సినిమా చెత్త అంటూ మొదటి షో చూసి 1.5/5 రేటింగ్ ఇచ్చారు.

 

దీంతో సినిమా ప్లాప్ అనుకున్నారు. కానీ సినిమా కలెక్షన్స్ చూశాక అందరికి మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ ఫుల్ 4 ఇటీవల 200కోట్ల వసూళ్లను దాటేసింది. సినిమాలో కమర్షియల్ యాంగిల్ డోస్ ఎక్కువైనప్పటికీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు పెరిగాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా అక్షయ్ డిఫరెంట్ హిట్ అందుకున్నాడు.

read also పూర్ రేటింగ్స్...డిజాస్టర్ టాక్...బ్లాక్ బస్టర్ కలెక్షన్స్

ఈ సినిమాతో వరుసగా 10 బాక్స్ ఆఫీస్ విజయాలను అందుకున్న హీరోగా అక్షయ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అందులో మినిమమ్ 100కోట్లు దాటినా సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ కూడా ఇలాంటి సక్సెస్ లు మరిన్ని అందుకోవాలని అక్షయ్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు.