బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి షూటింగ్ స్పాట్ లో కొట్టుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్క్కర్లు కొడుతోంది. వారిని ఆపడానికి మద్యలోకి ఎంత మంది వచ్చినా ఇద్దరూ ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

ఇదంతా నిజంగానే జరిగింది కానీ ఓ వార్తకి కౌంటర్ గా అక్షయ్, రోహిత్ లు ఈ కామిక్ వీడియో తీశారు. అసలు విషయంలోకి వస్తే.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ కామెంట్స్!

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో కరణ్ జోహార్ కల్పించుకొని ఇద్దరి మధ్య రాజీ చేశారని.. ప్రముఖ వెబ్ సైట్ లో కథనం వచ్చింది. ఆ గాసిప్ కి కౌంటర్ గా అక్షయ్, రోహిత్ నిజంగానే కొట్టుకున్నట్లు వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

''బ్రేకింగ్ న్యూస్.. అక్షయ్, రోహిత్ మధ్య గొడవ.. లైవ్‌లో చూడండి.'' అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన ఈ వీడియోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

తమపై వచ్చింది తప్పుడు వార్త అని తెలియజేయడానికి ఇన్నోవేటివ్ దారి ఎన్నుకొని ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంత క్రియేటివిటీతో ఆలోచింది తప్పుడు వార్తను  ఖండించిన అక్షయ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వీడియోకి లైకులు కొట్టి, కామెంట్స్ పెడుతున్నారు.