Asianet News TeluguAsianet News Telugu

బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ కామెంట్స్!

ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా యామీ గౌతం నటించింది. 

Would Yami Gautam want a bald man as her life partner? Why not, asks Bala actress
Author
Hyderabad, First Published Nov 13, 2019, 2:40 PM IST

అమ్మాయిలు పెళ్లి చేసుకునే అబ్బాయి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగం, ఆస్తిపాస్తుల సంగతులు పక్కన పెడితే ముందుగా పెళ్లికొడుకుకి బట్టతల మాత్రం ఉండకూడదని భావిస్తారు. ఈ తరం అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో అసలు రాజీ పడడం లేదు.

దీంతో బట్టతల ఉన్న అబ్బాయిలు దాన్ని కవర్ చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన చిత్రమే 'బాలా'. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. 

తెలుగమ్మాయి హాట్ సెగలు.. తట్టుకోగలమా..?

ఇందులో అతనికి భార్యగా యామీ గౌతం నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీకి ఓ ప్రశ్న ఎదురైంది. వెండితెరపైనే కాకుండా  నిజజీవితంలోనూ బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా..? అని యామీని ప్రశ్నించగా.. 'ఎందుకు చేసుకోకూడదు' అని తిరిగి ప్రశ్నించింది. బట్టతల అనేది పెళ్లికి అడ్డుకాదని వెల్లడించింది.

నిజానికి బట్టతల ఉన్నవారు చాలా శాంతస్వరూపులని తెలిపింది . అయితే.. అసలు బట్టతల ఉన్న వ్యక్తులు ముందుగా వాళ్లని ప్రేమించుకోవాలని.. ఆ తరువాతే మిగితా వాళ్ల నుండి ప్రేమని కోరాలని.. ఇదే సినిమా ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చింది. 'బాలా' సినిమా విజయం పట్ల యామీ గౌతం సంతోషం వ్యక్తం చేసింది.

పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని, ఇందులో టిక్ టాక్ స్టార్ గా వైవిధ్యభరితమైన పాత్ర చేసే ఛాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లో రూ.61 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios