రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి  అరవింద్ కూమార్ IAS  గారు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన సినిమా నటి అమల అక్కినేని ఈరోజు తన నివాసంలో 5 మొక్కలు నాటడం జరిగింది.

రమ్యకృష్ణ ‘క్వీన్’ తెలుగులో... ఈ రోజు నుంచే!

ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను అభినందించారు. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలని అమల గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

ఈ ఛాలెంజ్ ని స్వీకరించాలని రామ్ చరణ్ భార్య ఉపాసనని ట్యాగ్ చేశారు. తరచూ సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే అమల ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టి నటిగా బిజీ అవుతోంది.