హిట్ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి సాధారణంగా హీరోలు ఉత్సాహం చూపిస్తూంటారు. హిట్ లో ఉన్న హీరోలు దగ్గరకు ఆ డైరక్టర్స్ వచ్చి వాలుతూంటారు. అలాంటి పరిస్దితి లేకపోతే హీరోలే ఓ అడుగు ముందుకు వేసి, వాళ్లను కలిసి తమతో సినిమా చెయ్యమని కోరాల్సి ఉంటుంది. ఇప్పుడు అఖిల్ అలాంటి సిట్యువేషన్ లోనే ఉన్నాడు.

కెరీర్ లో హిట్ అనే పదం తెలియకుండా ముందుకు వెల్తున్న అఖిల్ తన స్ట్రాటజీలు మారిస్తే కానీ వర్కవుట్ కాదని తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయన దర్శకులను కలవటం, కథలు వినటం...చేస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా అఖిల్...ఓ దర్శకుడు తో రెగ్యులర్ గా టచ్ లోఉంటున్నట్లు సమాచారం. అతను మరెవరో కాదు...పీఎస్ మిత్రన్. ‘అభిమన్యుడు’ చిత్రంతో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్న తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌తో .

read also:మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

ఆయన తాజా చిత్రం ‘హీరో’ సెట్‌ కు వెళ్లి కలిసాడు అఖిల్‌. అయితే ఈ మీటింగ్ జరిగి ఓ నెల అయ్యింది. అప్పటి ఈ మీటింగ్‌ ఫలప్రదమైందని సమాచారం. అఖిల్‌ హీరోగా మిత్రన్ ఓ స్టోరీ లైన్ చెప్పారని, దానికి మెరుగులు దిద్ది రీసెంట్ గా వినిపించారని తెలుస్తోంది. తెలుగుకు చాలా కొత్త కథాంశం అని, నాగ్ కూడా ఆ లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నారు అఖిల్‌.

శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాని తెరకెక్కిస్తున్నారు మిత్రన్‌. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యే విధంగా ఈ సినిమాని రెడీ చేస్తారట. ఆ విధంగా ఓ హిట్ డైరక్టర్ తో చేసినట్లు ఉంటుంది. అదే సమయంలో ...తమిళంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఉంటుందని అఖిల్ ఆలోచనట.