చైనాల్లో పుట్టుకొచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలని వణికిస్తోంది. చైనాని పెను విధ్వంసం సృష్టించిన కరోనా వైరస్ ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా పాకింది. యూరప్ లోని కొన్ని దేశాలతో పాటు దుబాయ్, ఇండియా కూడా కరోనా బారీన పడ్డాయి. హైదరాబాద్, ఢిల్లీ లలో మొదలైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. 

మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం: ఖాళీ అయిన ఆఫీసులు

ఇక తాజాగా హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ భవనంలోని ఆఫీస్ యాజమాన్యాలు  తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించాయి. రహేజా మైండ్ స్పేస్ భవనంలో డీఎస్ఎం కంపెనీ, ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీలు తమ ఉద్యోగులని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించాయి. ఇటలీ నుంచి ఓ టెక్కీ రహేజా మైండ్ స్పేస్ భవనంలోకి వచ్చారు. 

ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. దీనితో ఉద్యోగుల్లో ఆందోనళ నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం ప్రజల్లో కరోనా వైరస్ పై తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై యువ సినీ హీరో అక్కినేని అఖిల్ స్పందించాడు. 

రహేజా మైండ్ స్పేస్ భవనం ఖాళీ అవుతుండడం గురించి తెలుసుకున్నాను. మీ పట్ల, మీ తోటివారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది మనకు చాలా సీరియస్ సిచ్యువేషన్. బీ కేర్ ఫుల్ అని అఖిల్ ట్వీట్ చేశాడు.  

సినిమాల విషయానికి వస్తే అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్.