కోలీవుడ్ బెస్ట్ స్టార్ సెలబ్రేటిస్ కపుల్స్ లో అజిత్ - షాలిని జోడీ ఎప్పుడు టాప్ లో ఉంటుందనే చెప్పాలి. హీరోయిన్ గా కెరీర్ ఒక రేంజ్ కొనసాగుతున్నప్పటికీ ప్రేమ కోసం షాలిని అన్ని వదిలేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. భర్త అజిత్ ని ప్రేమగా చూసుకోవడంలో ఆమె నిత్యం అభిమానులతో పోటీ పడుతూనే ఉంటారు. అభిమానుల ప్రేమ చాలా గొప్పదని అజిత్ ఫ్యాన్స్ కి కూడా ఆమె దగ్గరగా ఉంటారు.

ఇకపోతే తన భార్య పుట్టినరోజు సందర్బంగా ఈ స్టార్ హీరో ఒక ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌ తో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమెతో చదువుకున్న కొంత మంది స్నేహితులను అజిత్ బర్త్ డే వేడుకకు రప్పించాడు. కళ్ళముందు తన చిన్ననాటి స్నేహితులను చూసి షాలిని సంబరపడిపోయింది. షాలిని ఈ నెల 20న 40వ వసంతంలోకి అడుగుపెట్టింది.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

పేరెంట్స్ - కిడ్స్ తో ఈ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానని ముందే షాలినికి చెప్పిన అజిత్ ఆమె ఊహించని విధంగా ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌ఇచ్చారు.  వేడుకలో మొత్తం ఆమె చిన్ననాటి స్నేహితులు కనిపించారు. భర్త ఇచ్చిన ఈ బర్త్ డే గిఫ్ట్ కి షాలిని కొంత భావోద్వేగానికి లోనై తన స్నేహితులతో కొన్ని గంటలపాటు ముచ్చటించారు. అలాగే తన పిల్లలను స్నేహితులకు పరిచయం చేసిన షాలిని వారితో ఫోటోలు దిగింది. 2000వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న అజిత్ శాలినిలకు కుమార్తె అనౌష్క, కుమారుడు అద్విక్‌లు ఉన్నారు.