సెలబ్రిటీలపై నెటిజన్లతో పాటు మీడియా ఫోకస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై కంటే వారి పిల్లలపైనే అందరి దృష్టి పడుతుంది. వారికి సంబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతోంది. కరీనా కంటే ఆమె కొడుకు తైమూర్ నే హైలైట్ చేస్తూ ఉంటారు.

అయితే దీని కారణంగా కొందరు సెలబ్రిటీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు కాజోల్, అజయ్ దేవగన్ ల కూతురు నైసా దేవగన్ ఒకరు. ఆమె వయసు 14 ఏళ్లు.. అయినప్పటికీ ఆమెకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె వేసుకునే బట్టలపై పలు విమర్శలు వస్తుంటాయి.

రాజకీయనాయకుడితో సంబంధం అంటగట్టారు.. హీరోయిన్ కామెంట్స్!

ఇప్పటివరకు చాలా సార్లు నైసా ట్రోలింగ్ కి గురైంది. తాజాగా ఈ విషయంపై అజయ్ దేవగన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ట్రోల్ చేసే వారు అవతలి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్ధం కూడా చేసుకోలేరని అన్నారు. అజయ్ దేవగన్ తండ్రి చనిపోయినప్పుడు నైసా బ్యూటీ పార్లర్ కి వెళ్లింది. ఆ సమయంలో ఆమెని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఇంట్లో తాత మరణిస్తే నైసా మాత్రం బ్యూటీపార్లర్ కి వెళ్లిందంటూ ట్విట్టర్ లో ఆమెని విపరీతంగా ట్రోల్ చేశారు.

ఈ విషయంపై స్పందించిన అజయ్ దేవగన్.. తాతగారు చనిపోయారని నైసా ఉదయం నుండి ఏడుస్తూనే ఉందని.. కూతురి బాధ చూసి తట్టుకోలేక.. బయటకి వెళ్లి ఏదైనా తిని రమ్మని చెప్పానని.. ఎక్కడకి వెళ్లాలో నైసాకి అర్ధం కాకపోతే.. పార్లర్ కి వెళ్లి హెయిర్ వాష్ చేయించుకొని రమ్మని తనే పంపించినట్లు అజయ్ దేవగన్ వెల్లడించారు.

ఆ సమయంలో మీడియా వాళ్లు నైసా ఫోటోలు తీశారని.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని చెప్పారు. నైసా ఇంటికి వచ్చి ఏడ్చేసిందని గుర్తు చేసుకున్నారు. నా కూతురిని అనే హక్కు మీకెవరు ఇచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తాతయ్య చనిపోయారనే బాధ నుండి ఆమె ఊరట చెందుతుందని బయటకి పంపిస్తే.. నెటిజన్స్ సందర్భం ఏంటో తెలియక నోటికొచ్చినట్లు కామెంట్స్ చేశారని మండిపడ్డారు.