బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పేరు చెప్పగానే అతడి విలక్షణ నటన, సాహసాలు గుర్తుకు వస్తాయి. అజయ్ దేవగన్ ఐదు పదుల వయసులో కూడా అదరగొడుతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వార్త సినీ అభిమానులతో పాటు అజయ్ దేవగన్ ఫ్యామిలీని కూడా షాక్ కి గురిచేసింది. 

అజయ్ దేవగన్ కుమార్తె నైసా సింగపూర్ లో చదువుకుంటోంది. ఇటీవల నైసా  సింగపూర్ నుంచి తిరిగి వచ్చిందట. నైసా కు కరోనా లక్షణాలు ఉండడంతో కాజోల్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది.. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని జోరుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అజయ్ దేవగన్ స్పందించాడు. 

అకిరా గురించి అతిగా.. రేణు దేశాయ్ రియాక్షన్ అదుర్స్, పవన్ సాంగ్ కోసం తంటాలు!

తన కుమార్తె గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అజయ్ ఖండించాడు. 'నా కుమార్తె ఆరోగ్యం గురించి అడుగుతున్నందుకు థాంక్స్. కాజోల్,  నైసా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు నిరాధారమైనవి, అవాస్తవాలు అని అజయ్ ట్వీట్ చేశాడు. 

సినిమాల విషయానికి వస్తే అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అజయ్ దేవగన్ తానాజీ చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నాడు.