Asianet News TeluguAsianet News Telugu

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. తమిళ్ లో స్టార్ కమెడియన్

డిఫరెంట్ డ్రామా థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక న్యూ కామెడీ జానర్ ని టచ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ ఒక్క సినిమాతో మనోడి క్రేజ్ బాలీవుడ్ కి కూడా తాకింది. పదేళ్ల అనంతరం కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకున్న నవీన్ మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు.

agent sai srinivasa atreya tamil  ramake planings
Author
Hyderabad, First Published Nov 12, 2019, 8:30 AM IST

ఈ ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిఫరెంట్ డ్రామా థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక న్యూ కామెడీ జానర్ ని టచ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ ఒక్క సినిమాతో మనోడి క్రేజ్ బాలీవుడ్ కి కూడా తాకింది. పదేళ్ల అనంతరం కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకున్న నవీన్ మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు.

agent sai srinivasa atreya tamil  ramake planings

ఇకపోతే ఈ కథను తమిల్ లో రీమేక్ చేసేందుకు గత కొన్ని వారాలుగా డిస్కర్షన్స్ జరుగుతున్నాయట. ఇప్పటికే సినిమా హక్కులను ఒక ప్రముఖ కోలీవుడ్ ప్రొడ్యూసర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో నవీన్ రేంజ్ లో నటించే యాక్టర్ ఎవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. లేటెస్ట్ గా వచ్చిన రూమర్స్ ప్రకారం స్టార్ కమెడియన్ సంతానం ఈ తమిళ్ ఆత్రేయగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సంతానం డిఫరెట్ కథలతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ కమెడియన్ గా అందుకున్న క్రేజ్ ఇప్పుడు హీరోగా అందుకోలేకపోతున్నాడు. అందుకే తనకు సెట్టయ్యే కథల కోసం వెతుకుతుండగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ గురించి విన్నాడట. సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ట్విస్ట్ లతో పాటు  కామెడీకి మంచి స్కోప్ ఉండడంతో ఎలాగైనా సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రీమేక్  పై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న మన ఏజెంట్..!  

ఇక నవీన్ పోలిశెట్టి వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో మంచి అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మహానటి సినిమాను నిర్మించిన స్వప్న సినిమాస్ మంచి గుర్తింపును తెచ్చుకుంది.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నిర్మించాలని నిర్మాత అశ్వినీదత్ కూతుళ్లతో ఈ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు.  స్వప్న సినిమాస్ నెక్స్ట్ మరో కొత్త దర్శకుడితో ఒక ప్రయోగాత్మకైనా కథను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంది. ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టిని హీరోగా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios