మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమించిందని ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌ లో ఆమెకి చికిత్స అందించారు. ఆమెకి న్యూమోనియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

సుమారు 28 రోజులపాటు హాస్పిటల్ లో ఆమెకి చికిత్స జరిగింది. న్యూమోనియా, ఛాతిలో ఇన్ఫెక్షన్ తో బాధ పడిన ఆమె ఇప్పుడు కోలుకుంటున్నారు. దీంతో ఆమెని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తానిప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని, తన క్షేమాన్ని కోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు.

డిజాస్టర్ దెబ్బ.. 2019లో కనిపించని టాలీవుడ్ హీరోలు

ఈ క్రమంలో లతా మంగేష్కర్ ని నటుడు దిలీప్ కుమార్ కలిశాడు. తన చిన్ని చెల్లెలు ఇప్పుడు కోలుకుంటుందని.. ఆ విషయం తనకు ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతూ ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

తన కెరీర్‌లో దాదాపు 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు లతా మంగేష్కర్. ఆమెను అంతా నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. భారత ప్రభుత్వం లతను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ప్రస్తుతం ఆమె వయసు తొంబై ఏళ్లు.