టాలీవుడ్ లో మరో కమర్షియల్ దర్శకుడిగా వెంకీ కుడుముల ఎదుగుతున్నాడు. ఛలో చిత్రంతో దర్శకుడిగా మారిన వెంకీ.. తొలి చిత్రంతోనే మంచి విజయం దక్కించుకున్నాడు. ఛలో చిత్రాన్ని వెంకీ కుడుముల రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. నాగశౌర్య, రష్మిక జంటగా నటించిన ఛలో చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 

తాజాగా విడుదలైన భీష్మ చిత్రం అంతకు మించిన విజయం దిశగా దూసుకుపోతోంది. భీష్మ చిత్రం రిలీజై వారం గడవకముందే బ్రేక్ ఈవెన్ సాధించింది. అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. ఈ చిత్రంలో నితిన్, రష్మిక జంటగా నటించారు. నితిన్, రష్మిక, వెన్నెల కిషోర్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. 

వెంకీ కుడుముల తెరకెక్కించిన విధానానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. రెండు వరుస హిట్స్ దక్కడంతో పలు నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు సైతం వెంకీతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా వెంకీకి ఓ గోల్డెన్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ ఫ్రాంఛైజ్ లో మహేష్.. మరో హీరో కూడా..!

ఇటీవల వెంకీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని కలసి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. పాయింట్ నచ్చడంతో పూర్తి కథ సిద్ధం చేసి నేరేషన్ ఇవ్వమని రాంచరణ్ వెంకీని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటించే చిత్రం ఏదీ ఖరారు కాలేదు. వెంకీ కనుక కథతో మెప్పిస్తే చరణ్ నెక్స్ట్ మూవీ ఇదే కావచ్చు.