సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్ లో చాలా కూల్ గా ఉండే వ్యక్తి. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పని తాను చేసుకుంటాడు. సూపర్ స్టార్ గా విశేషమైన అభిమానులని సొంతం చేసుకున్న మహేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో మహేష్ ఒకరు. 

మహేష్ బాబులో కామెడీ టైమింగ్ కూడా బాగా ఉంటుంది. ఖలేజా, దూకుడు, తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో మహేష్ వేసిన కామెడీ పంచులు అందరిని నవ్వించాయి. మహేష్ బాబు ఆఫ్ స్క్రీన్ లో కూడా కామెడీ పంచ్ లు వేస్తాడు. అందుకు ఈ సంఘటనే నిదర్శనం. 

ఇటీవల మహేష్ ఎయిర్ పోర్ట్ కి వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మహేష్ కారు దిగి ఎయిర్ పోర్ట్ లోకి వెళుతున్నంత సేపు అక్కడున్న ఓ ఫోటో గ్రాఫర్ మహేష్ ని ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. మహేష్ కు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ మహేష్ సహనం కోల్పోకుండా ఫోటో గ్రాఫర్ పై కామెడీ పంచ్ లు వేశాడు. 

'ఆపమ్మా ఆపు.. ఎప్పుడూ ఇదే  పనా.. బోర్ కొట్టట్లేదా నీకు' అని ప్రశ్నించాడు. దీనితో అక్కడున్న సిబ్బంది అంతా నవ్వుల్లో మునిగి తేలారు. ఈ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

కొన్ని రోజుల క్రితం దాదాపుగా ఇలాంటి సంఘటనే జూ.ఎన్టీఆర్ కు ఎదురైంది. ఎన్టీఆర్ కూడా ఫోటో గ్రాఫర్ ని ఉద్దేశిస్తూ.. నువ్వెప్పుడూ ఇక్కడే ఉంటావా.. స్నానం, నిద్ర అన్నీ ఇక్కడేనా అని సెటైర్లు వేశాడు. మహేష్ బాబు చివరగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించింది. మహేష్ తన తదుపరి చిత్రం కోసం పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు.