కరోనా వైరస్ పై ఇండియా పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలు, వైద్యులు, పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనా కట్టడి కోసం విరాళాలు  అందించారు. కొంతమంది సెలెబ్రిటీలు కూడా కరోనాకు గురయ్యాయి. 

కరోనా నుంచి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా.. కరోనా రోగుల చికిత్సలో బాగా ఉపయోగపడుతోంది. దీనితో కరోనా నుంచి కోలుకున్న వారు ఒక్కొక్కరుగా తమ బ్లడ్ ప్లాస్మాని డొనేట్ చేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి నఫీసా అలీ మేనకోడలు దియా నాయుడు తన బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేసిన సంగతి తెలిసిందే. 

దిల్ రాజు పెళ్లి ఫోటోలు.. ఆయన భార్యని చూశారా!!

తాజాగా ప్రముఖ నటి జోయా మొరానీ కూడా తన బ్లడ్ ప్లాస్మాని డొనేట్ చేశారు. బెడ్ పై బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేస్తున్న ఫోటోని ఆమె షేర్ చేశారు. తానూ సూపర్ కూల్ గా ఉన్నట్లు కామెంట్ పెట్టారు. కరోనా రోగులకు బ్లడ్ ప్లాస్మా థెరపీ బాగా పనిచేస్తోంది. అందుకే తానూ కూడా డొనేట్ చేస్తున్నట్లు జోయా తెలిపింది. 

నేనేం ఊరకే బ్లడ్ ప్లాస్మా ఇవ్వడం లేదు.. అబద్దం చెప్పను.. సర్టిఫికెట్ తో పాటు రూ 500 ఇచ్చారు అని జోయా తెలిపింది.