నటి రాధికా శరత్ కుమార్ తనకు తల్లి కాదని పేర్కొంది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. విదేశాల్లో పెరిగిన వరలక్ష్మీ 'పోడాపోడీ' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత కన్నడంలో నటించింది. తాజాగా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఇక తమిళంలో అయితే హీరోయిన్ గా, విలన్ గా రకరకాల పాత్రల్లో నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు కోపం ఎక్కువని, రౌడీనని, చిన్న వయసు నుండి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తానని చెప్పింది. అందుకే తనతో మాట్లాడడానికి చాలా మంది భయపడతారని చెప్పింది.

'డైరెక్టర్, హీరోతో పడుకుంటే ఆఫర్ ఇస్తాం'.. స్టార్ హీరో కుమార్తె షాకింగ్ కామెంట్స్!

మరో విషయాన్ని కూడా వరలక్ష్మీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. నటి రాధిక.. శరత్ కుమార్ రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శరత్ కుమార్ మొదటి భార్య కూతురు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తను రాధికని ఆంటీ అని పిలుస్తానని వరలక్ష్మీ తెలిపింది.

ఎందుకంటే ఆమె తన తల్లి కాదని.. తన తండ్రి రెండవ భార్య అని.. తనకు అమ్మ అంటే ఒక్కరేనని చెప్పుకొచ్చింది. తనకే కాదు ఎవరికైనా అమ్మ ఒక్కరేనని.. అందుకే రాధిక తనకు తల్లి కాదని, ఆంటీ అని చెప్పింది. అయితే తాను ఆమెని తన తండ్రి శరత్ కుమార్ తో సమానంగా గౌరవడం ఇస్తానని చెప్పింది.