దేశం మొత్తం 'దిశ' పై హత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ గురించి మాట్లాడుకుంటుంటే.. నటి శ్రీరెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది. ముందుగా ఆ నలుగురు క్రూరులను ఎన్ కౌంటర్ చేసి చంపేసిన తెలంగాణా పోలీసులకుహ్యాట్సాఫ్ చెప్పిన శ్రీరెడ్డి ఈ చావులు తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పింది.

ఆ తరువాత ఎప్పటిలానే ఈ ఘటనను కూడా పవన్ లింక్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ మాదిరి మూడు, నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని కూడా ఎన్ కౌంటర్  చేసి చంపేయాలని ఏపీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్ లో రాసుకొచ్చింది.

ఆడపిల్లల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి.. రేణుదేశాయ్ కామెంట్స్!

ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి తను బీజేపీ పార్టీని ప్రేమిస్తానని పవన్ కళ్యాణ్ ని కాదని చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని.. శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్ పై పలు అభియోగాలు మోపుతూనే ఉంది.

ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు గతంలో బాగా వైరల్ అయ్యాయి. అయితే పవన్ అభిమానులు మాత్రం శ్రీరెడ్డిని అంత సులువుగా వదిలిపెట్టలేదు. ఒకానొక దశలో ఆమె హైదరాబాద్ ని విడిచిపెట్టి చెన్నైకి వెళ్లిపోయింది.

ఇప్పుడు మళ్లీ తిరిగి హైదరాబాద్ కి వచ్చి ఎప్పటిలానే తన రచ్చ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తరచూ పవన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతోంది. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటుంది. తాజాగా మరోసారి పవన్ ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.