శ్రీరెడ్డి.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు పేరు. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచేది. తరచూ ఎవరోకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో జనాలు ఆమెని లైట్ తీసుకున్నారు.

దీంతో శ్రీరెడ్డి కొన్ని నెలల క్రితం యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. మొదట్లో ఈ ఛానెల్ లో తన ఇంటర్వ్యూలు పోస్ట్ చేసేది. అందులో కూడా బూతులే ఎక్కువగా ఉండేవి. దీంతో ఆ ఛానెల్ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అదే ఛానెల్ ని లక్షల మంది చూస్తున్నారు.

గ్యాంగ్ లీడర్ బ్యూటీ.. మాస్ లుక్ తో మైండ్ బ్లాక్

దానికి కారణం ఏంటంటే.. శ్రీరెడ్డి వంటలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తోంది. పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తోంది. అవి కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఒక్కో వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మొత్తానికి తన పేరుకున్న పాపులారిటీ వాడుకుంటూ యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. ఈ వీడియోలు చూస్తున్న వారు.. ఇలా హాయిగా నీ పని నువ్ చేసుకొని బతకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.