ఒకప్పుడు అడల్ట్ చిత్రాల్లో నటించిన షకీలా చాలా క్రేజ్ ఉండేది. మలయాళంలో ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోలు కూడా జంకే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే తను అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు షకీలా వెల్లడించింది.

తన ఇంట్లో జరుగుతున్న పెళ్లిలోనే ఘోర అవమానం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది షకీలా. తన సొంత అన్నయ్య పెళ్లి జరుగుతుంటే.. ఇంట్లో మనిషిగా కాకుండా ఏదో పరాయి వ్యక్తిని పిలిచినట్లు పిలిచారని.. అన్న పెళ్లి కదా అని అక్కడకి వెళ్తే.. తనను చూసి పెళ్లికూతురు అసహ్యించుకొని.. అక్కడ నుండి వెళ్లిపోయిందని.. కానీ తనకు ఆ విషయం అర్ధం కాలేదని చెప్పింది.

''నాకు ఫోన్ చేసేది వాడొక్కడే.. ఇప్పుడు వాడు కూడా లేడు''

ఆ తరువాత తను వాష్ రూమ్ కి వెళ్లగానే.. పెళ్లికూతురు మళ్లీ స్టేజ్ ఎక్కిందని చెప్పారు. ఆ తరువాత స్టేజ్ మీదకి వెళ్లి విష్ చేయాలనుకున్న సమయంలో తన సొంత తల్లితండ్రులు స్టేజ్ మీదకు రావొద్దంటూ సైగలు చేసిన విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

కాసేపటికి స్టేజ్ పైకి వెళ్తే.. తన అన్న అతడి భార్యని తీసుకొని దూరంగా వెళ్లి నిలబడి తనను అవమానపరిచాడని.. ఆ సమయంలో ఏడుపు కంట్రోల్ చేసుకోలేక అక్కడ నుండి వెళ్లిపోయాయని చెప్పుకొచ్చారు.

పెళ్లి జరిగిన రెండేళ్లకి తన అన్న భార్య ఫోన్ చేసి.. 'మీ అన్న నా నుండి కావాల్సింది తీసుకొని నన్ను వదిలేశాడు. మీ పట్ల అలా ప్రవర్తించినందుకు నాకు తగిన శాస్తే జరిగింది..' అంటూ క్షమాపణలు కోరిందని చెప్పారు. ఒక ఆడదానిగా తనకు కావాల్సిన సహాయాన్ని చేస్తానని చెప్పి ఆమెని సముదాయించినట్లు చెప్పింది.