''నాకు ఫోన్ చేసేది వాడొక్కడే.. ఇప్పుడు వాడు కూడా లేడు''

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వేణుమాధవ్ ని తలచుకొని కన్నీరు పెట్టుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

Actress Shakeela Gets emotional

ప్రముఖ నటి షకీలా, కమెడియన్ వేణుమాధవ్ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ ని సోదరుడిలా భావిస్తుంది షకీలా. అలాంటిది అతడు మరణించడం ఆమె తట్టుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వేణుమాధవ్ ని తలచుకొని కన్నీరు పెట్టుకుంది.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది.

బన్నీ ఎవరో తెలియదు.. మహేష్, తారక్ లపై షకీలా కామెంట్స్

తన జీవితంలో ఆల్ టైం గుడ్ ఫ్రెండ్స్ అనేవారు ఎవరూ లేరని.. చాలా మందితో కలిసి పని చేసినప్పటికీ తనకు స్నేహితులు మాత్రం లేరని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో తను ముగ్గురితో మాత్రమే క్లోజ్ గా ఉంటానని.. వారిలో అలీ అన్న ఒకరని చెప్పింది.

ఎప్పుడైనా సినిమాల కోసం ఫోన్ చేసి మాట్లాడుతుంటానని.. మరో వ్యక్తి గీతాంజలి అనే నటి అని చెప్పారు. ఇక మూడోది వేణుమాధవ్ అని చెప్పారు. వేణు తనకు తమ్ముడి లాంటివాడని.. అక్కా తిన్నావా అంటూ ఫోన్ చేసి అడిగే ఏకైక వ్యక్తి వాడేనని చెప్పారు.

అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడని.... వాడే బతికి లేనప్పుడు ఇక నేను వాడి కుటుంబంతో ఎలా మాట్లాడతాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక దర్శకుల్లో తను గౌరవించే వ్యక్తి కోడిరామకృష్ణ గారని.. ఆయన కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. 

Actress Shakeela Gets emotional

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios