హీరోయిన్ రాశి ఇటీవల కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ పాపులర్ షోలో పాల్గొంది. ఈ షోలో రాశి నటిగా తన అనుభవాలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంది. అలీ అడిగిన అనేక ప్రశ్నలకు రాశి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో కలసి రాశి గోకులంలో సీత చిత్రంలో నటించింది. 

ఆ చిత్రం తనకు ఓ మంచి అనుభూతి అని రాశి పేర్కొంది. తన కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా పవన్ తో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనని రాశి వివరించింది. నా కుమార్తె ఫస్ట్ బర్త్ డే కోసం చాలా మంది ప్రముఖుల్ని ఆహ్వానించా. పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించాలని అనుకున్నా. 

డైరెక్టర్ తేజ నన్ను మోసం చేశాడు.. హీరోయిన్ రాశి కామెంట్స్!

ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా పవన్ ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళా. గోకులంలో సీత తర్వాత మేమిద్దరం కలిసింది చాలా తక్కువ. అయినా కూడా మనకు తెలిసిన వ్యక్తే కదా.. నా కోస్టారే కదా రిసీవ్ చేసుకుంటారులే అని వెళ్ళా. ఆ సమయంలో పవన్ గచ్చిబౌలిలో షూటింగ్ లో ఉన్నారని తెలిసి స్పాట్ కు వెళ్ళా. 

షూటింగ్ లొకేషన్ కు కొంత దూరంలో కారు ఆపాం. దూరంగా పవన్ కళ్యాణ్ క్యారవ్యాన్ కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా పవన్ సెక్యూరిటీ కనిపిస్తున్నారు. మేడం మనం పాత పవన్ కళ్యాణ్ అనుకుని వచ్చేశాం.. ఆయన వద్దకు వెళ్లాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలేమో అని అన్నాడు. 

పవన్ కోసం నన్ను సెలెక్ట్ చేసింది సురేఖగారే.. 'రంగస్థలం' అందుకే ఒప్పుకోలేదు!

అప్పుడే పవన్ కళ్యాణ్ క్యారవ్యాన్ నుంచి దిగారు. నేను కారు లోపలే కూర్చుని ఉన్నాను. అక్కడకు వెళ్లి హీరోయిన్ రాశి వచ్చారని ఎవరికైనా చెప్పు.. పవన్ కళ్యాణ్ గారిని కలవడం కుదురుతుంది అంటే కలుద్దాం.. అప్అపాయింట్ మెంట్ తీసుకోవాలంటే నేను కారు కూడా దిగాను.. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం అని మా డ్రైవర్ కు చెప్పా. 

మా డ్రైవర్.. రాశిగారు వచ్చారు అని చెప్పగానే.. ఆవిడదేనా ఆ కారు.. ఎందుకు కారులోనే ఉన్నారు.. రమ్మని చెప్పండి అని పవన్ అన్నారు.. ఆయనే స్వయంగా నిల్చుని నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా సమయం మాట్లాడారు. మా ఫ్యామిలీ బాగోగులు అడిగారు. పవన్ కి మా బ్రదర్ ప్రత్యేకంగా తెలుసు. అలా తాను తన కుమార్తె ఫస్ట్ బర్త్ డేకి ఇన్వైట్ చేసినట్లు రాశి తెలిపింది.