ప్రియాంక రెడ్డి మర్డర్ కేసు.. నగరంలోనే కాకుండా దేశమంతా అందరిని షాక్ కి గురి చేసింది. ఘటనపై సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు అందరు స్పందిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో #RIPPriyankaReddy అనే హ్యాష్‌ట్యాగ్‌ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చాలా మంది సినీ తారలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ సినిమాలకు సంబందించిన కొన్ని సీన్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో క్లయిమ్యాక్స్ లో చెప్పిన కోర్టు సీన్స్ తో పాటు రాఖీ సినిమాలో చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలతో అభిమానులు ఘటనపై నిరసనలు తెలుపుతున్నారు. రాఖీ సినిమా అప్పట్లోనే చాలా మందిలో సరికొత్త ఆలోచన రేకెత్తించింది.  

ఇక టెంపర్ సినిమాలో మానవ చట్టాలను ప్రశ్నిస్తూ పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ఎవ్వరు మరచిపోలేరు. ఎంత మంచి ఆడవాళ్ళ మరణఘోష వినబడుతున్నా దారుణాలు మాత్రం ఆగడం లేదని అన్నిటికి ఒకే సమాధానంగా అత్యాచారం చేసిన వాళ్ళని నడి రోడ్డున శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.