మెగాడాటర్ నీహారిక పెళ్లి వ్యవహారం మరోసారి మెగాకాంపౌండ్ లో చర్చకు వచ్చింది. గతంలో ఓసారి ఆమె పెళ్లి విషయంలో చర్చకి వచ్చినప్పటికీ ఆ వ్యవహారాన్ని పక్కనపెట్టేశారు. కానీ ఈసారి మాత్రం ఓ మంచి సంబంధం చూసి నీహారికకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది మెగా కాంపౌండ్. నీహారిక కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

ఇప్పటివరకు కేవలం సినిమాల కోసం నీహారిక తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఆమె కెరీర్ అనుకున్నంత గొప్పగా సాగలేదు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. అయితే తన తండ్రి నాగబాబు పెళ్లి చేసుకోవాలని నీహారికకి సలహా ఇచ్చినట్లు.. పెళ్లికి ఆమెని ఒప్పించినట్లు సమాచారం.

'నువ్వు తెలుగు అమ్మాయివి'.. నా తల్లి చివరి కోరిక అదే: నటి రేఖ!

పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న రెండు పెద్ద కుటుంబాలకు చెందిన సంబంధాలని నీహారిక కోసం చూసి పెట్టారు. ఈ రెండు సంబంధాల్లో ఒకటి ఫైనల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవిలోపు నీహారిక పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. గతంలో నీహారిక పెళ్లిపై చాలా పుకార్లు వచ్చాయి.

ఒక దశలో ఆమె హీరో నాగశౌర్యని పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగా మిగిలిపోయాయి. ఆ తరువాత తెరపైకి విజయ్ దేవరకొండ పేరు వచ్చింది. అయితే నీహారికకి తను బిగ్ బ్రదర్ లాంటి వాడినని చెప్పి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు విజయ్ దేవరకొండ.

అలానే హీరో సాయి ధరం తేజ్ కూడా నీహారికపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తనకు నీహారిక వరస అయినప్పటికీ.. చిన్నప్పటి నుండి కలిసి పెరగడం వలన నీహారికను  ఎప్పుడూ ఆ కోణంలో చూడలేదని చెప్పాడు ధరం తేజ్. ఇప్పుడు మెగా కాంపౌండ్ పెద్దలంతా కలిసి నీహారిక పెళ్లి విషయాన్ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా నీహారిక 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిన్న పాత్ర పోషించింది.