Asianet News TeluguAsianet News Telugu

రొమాన్స్ బోర్ కొట్టేసింది : నమిత

ఈ సినిమా తరువాత తమిళంలో ఎక్కువగా అవకాశాలు వస్తాయని భావించింది కానీ తనకు నచ్చిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదని సమాచారం.

Actress Namitha Comments on Romantic films
Author
Hyderabad, First Published Feb 26, 2020, 12:07 PM IST

ఒకప్పుడు తెలుగులో కొన్ని చిత్రాలు చేసిన హీరోయిన్ నమిత ఆ తరువాత తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ నటి 'బొట్టు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చింది.

ఈ సినిమా తరువాత తమిళంలో ఎక్కువగా అవకాశాలు వస్తాయని భావించింది కానీ తనకు నచ్చిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదని సమాచారం. అయితే మలయాళంలో మాత్రం ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

'కార్తికదీపం' ఫ్యాన్స్ కి షాక్.. వంటలక్క స్థానంలో మరొక నటి..?

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ సినిమా ఆడియో ఈవెంట్ లో నమిత ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. తనకు రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టమని.. ఎక్కువ చూసేదాన్ని అని చెప్పింది.

రొమాన్స్ చిత్రాలు చూసి, చూసి బోర్ కొట్టేసిందని.. ఇప్పుడు ఆ తరహా చిత్రాలు నచ్చడం లేదని.. కామెడీ సినిమాలే చూడాలనిపిస్తోందని.. ఎక్కువగా హాస్య చిత్రాలే చూస్తున్నానని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios