యంగ్ హీరో మెహ్రీన్ టాలీవుడ్ చాలా సినిమాల్లోనే నటించింది. ఇటీవల విడుదలైన 'ఎంత మంచివాడవురా', 'అశ్వథ్థామ' వంటి చిత్రాల్లో హీరోయిన్ కనిపించింది. అయితే 'అశ్వథ్థామ' సినిమా సమయంలో హీరో నాగశౌర్య తండ్రి మెహ్రీన్ ని ఇబ్బంది పెట్టారట.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 'అశ్వథ్థామ' సినిమాకి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ లో మెహ్రీన్ పాల్గొంది. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిరవహించారు. దానికి గెస్ట్ గా రాఘవేంద్రరావుని పిలిచారు. దీంతో ఈవెంట్ కి తప్పకుండా హాజరు కావాలని శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్.. మెహ్రీన్ కి చెప్పారట.

హీరోయిన్ కి తీసిపోని ఫేస్.. కానీ చేసిది ఫ్రెండ్ రోల్స్.. అందుకే సోషల్ మీడియాలో హాట్ ఫోజులు!

కానీ అప్పటికే మెహ్రీన్ అలర్జీతో బాధపడుతుండడంతో రాలేనని చెప్పిందట. డాకర్లు సూచించిన ప్రిస్క్రిప్షన్ పంపించిందట. అయినప్పటికీ శంకర్ ప్రసాద్ మాత్రం ఒప్పుకోలేదట. ఈవెంట్ కి రాఘవేంద్రరావు వస్తున్నారని.. హీరోయిన్ లేకపోతే బాగోదని, కచ్చితంగా వచ్చి తీరాల్సిందేనని గట్టిగా చెప్పారట.

ఒకవేళ రాకపోతే మెహ్రీన్ కి సంబంధించిన హోటల్ బిల్స్ కట్టనని బెదిరించారట. ఆయన ప్రవర్తన నచ్చకపోవడంతో మెహ్రీన్ చెప్పకుండా హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఆ తరువాత హోటల్ యాజమాన్యం శంకర్ ప్రసాద్ కి ఫోన్ చేసి మెహ్రీన్ వెళ్లిపోయిన విషయాన్ని తెలిపి.. బిల్ కట్టమని అడిగారట. చేసేదేంలేక బిల్లులు అన్నీ కట్టారట. అయితే ఈ విషయాలను మెహ్రీన్ మీడియా ముందు మాత్రం చెప్పాలనుకోవడం లేదు. ఆమె చెప్పకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా.. విషయం మాత్రం బయటకి వచ్చేసింది.