పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానినని చెప్పుకునే మాధవీలతా సందర్భం వచ్చిన ప్రతీసారి అతడిపై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూనే ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీలో మెంబర్ గా బైక్ ర్యాలీలు కూడా నిర్వహించింది.

కానీ పవన్ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో బీజేపీలో చేరింది. ఇప్పుడు పవన్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మాధవీలతా తెగ ఆనందపడుతోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పవన్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

'RIP మాధవీలత'.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ పోస్ట్!

పవన్ కళ్యాణ్ కి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పవన్ కి ఆవేశం ఎక్కువ.. పవన్ కళ్యాణ్ పనికిరాడు.. అని మొన్నటివరకు మాట్లాడిన మా పార్టీలో(బీజీపీ) కొందరు ఇప్పుడు పవన్ వెంటే తిరుగుతున్నారని.. అది పవన్ కళ్యాణ్ అంటే అంటూ గొప్పగా చెప్పుకుంది.

మా సినిమా వాళ్లంటే అంటే.. వాళ్లకున్న చార్మ్, వాళ్లకున్న విలువలని ఎవరూ మార్చలేరని.. ఎవరైనా వెనక నడవాల్సిందేనని చెప్పారు. ఏపీ రాజకీయాలను వదిలేయాలని అనుకున్న కొంతమంది కూడా ఇంకా అక్కడే ఉండాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అది కేవలం పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేస్తానని చెప్పినందుకేనని వెల్లడించింది. ఈ రాజకీయాలు ఏంటో అర్ధం కావని తెలిపింది.