కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్ర సెట్స్ లో కొన్ని రోజుల క్రితం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్రేన్ విరిగి పడడంతో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడనే మరణించారు. ఈ ప్రమాదం నుంచి కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకోగా.. దర్శకుడు శంకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదం చిత్ర యూనిట్ ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. జరిగిన ప్రమాదానికి కారణాలు వివరించాలి అంటూ పోలీసులు కమల్ హాసన్, శంకర్, లైకా ప్రొడక్షన్స్ కు నోటీసులు పంపారు. ఇటీవల కమల్ హాసన్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు పోలీసులు కమల్ హాసన్ ని విచారించినట్లు తెలుస్తోంది. 

పోలీసులు గంటల తరబడి విచారించడంపై కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయం ఆసక్తికర ప్రకటన చేసింది. కమల్ హాసన్ ఆ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ఇండియన్ 2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. అంతకు మించి కమల్ కు ఆ ప్రమాదంతో ఏమైనా సంబంధం ఉందా.. పోలీసులు నేరస్తుడిని విచారించినట్లు అన్ని గంటల పాటు ఆయన్ని విచారించడం ఏంటి.. ఇందులో రాజకీయ దురుద్దేశం ఉంది అని పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 

జూ.ఎన్టీఆర్ మంత్రిగారి వియ్యంకుడా.. అసలు నిజం ఇదే!

దీనితో నటి కస్తూరి స్పందిస్తూ కమల్ హాసన్ పై  సెటైర్లు వేసింది. కేవలం మూడు గంటల పాటు విచారించడం తప్పైపోయిందా. కమల్ హాసన్ 3 గంటలు కూడా కూర్చోలేరా అని ప్రశ్నించింది. ఇలాంటి ప్రకటనలు విడుదల చేయడం వల్ల కమల్ హాసన్ ప్రతిష్టే దిగజారుతుంది అని కస్తూరి కామెంట్స్ చేసింది.