యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో  నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్ర రిలీజ్ కు చాలా సమయం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కూడా రెడీ ఓకే అయిపోయింది. 

మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఎన్టీఆర్ రెండవసారి నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రకటన వచ్చినప్పటి నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. 

వీపులు గోకేది వాళ్లే.. చిరంజీవి ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం.. నటి షాకింగ్ కామెంట్స్!

ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్..1983లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మంత్రిగారి వియ్యంకుడు' చిత్ర ఆధారంగా కథ రూపొందించుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదని త్రివిక్రమ్ సన్నిహితులు అంటున్నారు. ఈ చిత్రానికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సరికొత్త కథని సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ తయారు చేస్తున్న కథకు ఎలాంటి చిత్రంతో సంబంధం లేదని అంటున్నారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ లది ఆల్రెడీ సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత చిత్రం మంచి విజయం సాధించింది.