ప్రముఖ బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వ బోతున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకోకుండా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంటూనే గర్భం దాల్చింది. ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాను హ‌ర్ష్‌బెర్గ్‌ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు కల్కి తెలిపారు.

తాజాగా కరీనా కపూర్ రేడియో షోలో పాల్గొన్న కల్కి తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో మూడేళ్లు ప్రేమాయణం సాగించిన కల్కి ఆ తరువాత 2011లో అతడిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. రెండేళ్లకు మించి తమ వైవాహిక జీవితం కొనసాగలేదని చెప్పుకొచ్చింది.

ఆ నిర్మాత డేట్ కి పిలిచాడు.. వేశ్య అన్నారు.. నటి కామెంట్స్!

2013లో స్నేహపూర్వక వాతావరణంలో విడిపోయినట్లు కల్కి వెల్లడించారు. 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు తెలిపిన ఆమె ఇప్పటికీ అనురాగ్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనురాగ్ తో బంధం అనుకోకుండా విడాకులకు దారి తీసిందని.. పాతికేళ్ల వయసులో అనురాగ్ ని పెళ్లి చేసుకున్నానని.. తమ ఇద్దరి మధ్య వయసు తేడా కొంత గ్యాప్ కి కారణమై ఉండొచ్చని అన్నారు.

ప్రస్తుతం హ‌ర్ష్‌బెర్గ్‌ తో డేటింగ్ లో ఉంటూ గర్భం దాల్చినట్లు తెలిపారు. తన ప్రెగ్నెన్సీ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకున్నట్లు పలు ఇంటర్వ్యూలలో ఆమె తెలిపారు. అయితే తన మేకప్ మ్యాన్ వద్ద మాత్రం దాచలేకపోయానని చెప్పారు.

నాలుగో నెల వచ్చేసరికి అందరికీ విషయం తెలిసిపోయిందని.. తాను ప్రెగ్నెన్సీ అని తెలిసి బాలీవుడ్ హ్యాపీ గా ఫీల్ అయిందని.. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి కాకుండా ఇలాంటివి ఏంటని ట్రోల్ చేశారని ఆమె వాపోయింది. ఎవరేం అనుకున్నా.. తను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసి బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడని.. త్వరలోనే బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు.