అలనాటి అందాల తార సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. సడెన్ గా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం కన్నుమూశారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఆమె తెలుగుతో పాటు, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. 

ఆమె కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. నటిగా మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే తన సహనటుడు రామకృష్ణని వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. తన పెళ్లి విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది గీతాంజలి.

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

నటుడు రామకృష్ణ ఎన్నో సూపర్ హిట్చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఆయనతో సినిమాలు చేయాలని దర్శకనిర్మాతలు ఎదురుచూసేవారు. అటువంటి వ్యక్తి గీతాంజలిని 
చూసి ఇష్టపడ్డారట. ఆ విషయాన్ని ఆమెకి చెప్పినప్పుడు ఏడాది వరకుఒప్పుకోలేదట. ఆ సమయంలో తన బాధ్యతలు మొత్తం తన తండ్రే చూసుకునేవారని గీతాంజలి చెప్పింది.

దీంతో రామకృష్ణ తన తండ్రిని కలిసి మాట్లాడారని.. రామ‌కృష్ణ‌గారి గుణ‌గ‌ణాలు న‌చ్చ‌డంతో `అబ్బాయి మంచి అంద‌గాడు. డీసెంట్ బిహేవియ‌ర్‌` అని చెప్పి తనను పెళ్లికి ఒప్పించినట్లు గీతాంజలి వెల్లడించింది. ఇద్ద‌రం సినిమా రంగానికి చెందిన‌వారం కాబ‌ట్టి చాలా మంది మాది ప్రేమ వివాహం అనుకున్నారు.

కానీ మాది పెద్ద‌లు కుదిర్చిన వివాహమని క్లారిటీ ఇచ్చింది గీతాంజలి. పెళ్లికి ముందు మాత్రం సినిమాలు చేయకూడదని రామకృష్ణతనకు చెప్పారని.. ఆయన చెప్పినట్లే విన్నానని అన్నారు. ఇద్దరికీ పెళ్లి జరిగిన తరువాత రామకృష్ణ పదహారు సినిమాలు వరుసగా వచ్చాయని గుర్తుచేసుకున్నారు.  మంచిరోజు, పెళ్ళిరోజు, తోటలోపిల్లా కోటలోరాణి, రాజయోగం, రణభేరివంటి చిత్రాల్లో రామకృష్ణ, గీతాంజలి కలిసి నటించారు.