గోఎయిర్ విమాన సిబ్బందిపై ప్రముఖ టీవీ నటి, బిగ్ బాస్ 12 విజేత దీపికా కాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపికా కాకర్ ఆదివారం నాడు తన భర్త షోయబ్ ఇబ్రహీం, వదిన సబాతో కలిసి ముంబై నుండి లక్నోకి వెళ్లడానికి గోఎయిర్ విమానం ఎక్కారు.

విమానం ఎక్కిన తరువాత ఎంతసేపటికీ బయలుదేరకపోవడం, ఆలస్యానికి గల కారణం ప్రకటించకపోవడంతో.. దీపికా విమాన సిబ్బంది నిర్లక్ష్య వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

పాకిస్తాన్ లో భారత సినిమాల హవా.. బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

''వావ్ గో ఎయిర్.. మేం విమానం ఎక్కాం.. మీ ఫ్లైట్ జి 82610.. 45 నిమిషాల పాటు ఆలస్యమైంది.. దానికి గల కారణాలను సిబ్బందిని అడిగితే వారికి తెలియదని అన్నారు.. మీ గ్రౌండ్ స్టాఫ్ ని అడిగితే.. పైలట్ అందుబాటులో లేరని చెప్పారు. విమానం బయలుదేరడంలో ఆలస్యమవుతుందని తెలిసినప్పుడు.. ప్రయాణికులకు సమాచారం ఇవ్వడం, లేదా ఫ్లైట్ గంట ఆలస్యమవుతుందని ప్రకటన చేయాలి. కానీ విమాన సిబ్బందికి మర్యాద తెలియదు. విమాన జాప్యంపై ప్రకటన చేయడానికి తమకు అధికారం లేదని విమానంలోని సిబ్బంది చెప్పారు. కానీ ప్రయాణికులకు విమాన జాప్యం గురించి ఎవరు తెలియజేస్తారు..? విమానం బయలుదేరడంలో తీవ్ర జాప్యం జరిగినా మేం ఇంకా వేచి ఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'కహాన్ హమ్ కహాన్ తుమ్' అనే టీవీ షోలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.