ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్ పై కస్టమర్లు బాగా అలవాటు పడ్డారు. కొందరు ఫుడ్ డెలివరీ బాయ్స్ మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వచ్చింది. ఓ సంస్థకు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ వల్ల తమిళ సీనియర్ నటి గాయత్రి సాయి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 

వివరాల్లోకి వెళితే.. మణిరత్నం అంజలితో పాటు మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో గాయత్రీ సాయి నటించింది. ప్రస్తుతం ఆమె వెండి తెరకు దూరంగా ఉంటున్నారు. గాయత్రి సాయి కుటుంబ సభ్యులతో చెన్నైలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ లో గాయత్రి సాయి పిజ్జా ఆర్డర్ చేశారు. 

పరమేశ్వరన్ అనే డెలివరీ బాయ్ పిజ్జాని గాయత్రీ సాయి ఇంట్లో డెలివరీ చేశాడు. తన ఇంటికి చేరుకునేందుకు డైరెక్షన్స్ కోసం డెలివరీ బాయ్ పలుమార్లు గాయత్రీ సాయికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అతడు మాట్లాడే విధానం చూసి మత్తులో ఉన్నాడని గాయత్రీ గమనించింది. 

కొన్ని రోజుల తర్వాత గాయత్రీ ఫోన్ నంబర్ అడల్ట్ వెబ్ సైట్స్ తో పాటు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నట్లు గాయత్రికి తెలిసిందే. దీనితో ఆమె షాక్ కు గురైంది. ఈ ఫోన్ నంబర్ ఒక 'ఐటమ్'ది.. ఫోన్ చేయండి అంటూ అసభ్యంగా సర్కులేట్ కావడంతో షాకయ్యానని గాయత్రీ తెలిపారు. 

Indian2:'ఆ క్రేన్ నా మీద పడున్నా బావుండేది'.. శంకర్ షాకింగ్ కామెంట్స్!

వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే సదరు డెలివరీ బాయ్ పై కేసు కూడా నమోదు చేశారు. తన ఫోన్ నంబర్ సర్కులేట్ కాకుండా చూడాలని పోలీస్ వారిని ఆమె కోరారు. పోలీసులు సీసీ టివి ఫుటేజ్ ఆధారంగా డెలివరీ బాయ్ ని అరెస్ట్ చేశారు.