ప్రముఖ కోలీవుడ్ నటి అమలా పాల్ తండ్రి పాల్ వర్గీస్(61) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న పాల్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అమల నటించిన 'అదోఅంద పారావాయ్ పోలా' అనే సినిమా ట్రైలర్ లాంచ్ కోసం అమలా పాల్ రెండు రోజుల పాటు చెన్నైలో ఉన్నారు.

రష్మిక వీడియో చూశారా.. నిమిషం పాటు ఆపకుండా..

తన తండ్రి మరణ వార్త వినగానే ఆమె వెంటనే తన స్వస్థలమైన కేరళకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెట్ పాల్ చర్చిలో మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాల్ వర్గీస్ కి భార్య ఆన్నిస్ పాల్, పిల్లలు అమల, అభిజిత్ లు ఉన్నారు.