'ఫిదా', 'సీతా ఆన్ ది రోడ్' వంటి చిత్రాల్లో నటించిన గాయత్రి గుప్తా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి షాకిచ్చింది. దీని వలన ఆమెకి అవకాశాలు రాకుండాపోయాయి. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ముందుగా నటి శ్రీరెడ్డి గురించి మాట్లాడింది. ఆమె చెప్పేవన్నీ నిజాలేనని.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని అన్నారు. అయితే శ్రీరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానాలు విని ఈ రచ్చతో కలిగే ప్రయోజనాలు ఏమీ లేవని, ఎంతో కాలం నిలవదనిపించి సైలెంట్ గా ఉండిపోయానని తెలిపింది.

అనసూయ రేటు ఎంతంటే..? హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

కాస్టింగ్ కౌచ్ అనేదీ ప్రతీ చోటా ఉంటుందని.. కానీ అది ఇద్దరి ఇష్టం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పింది. ఒకరు కమిట్మెంట్ అడిగినప్పుడు హీరోయిన్ కి ఇష్టం లేకపోతే నో అని చెప్పొచ్చని.. దాని వల్ల అవకాశం పోతుంది కానీ వచ్చే నష్టం లేదని.. ఎక్కడ అవకాశాలు రావో అని శ్రీరెడ్డి కూడా ఇష్టంతోనే అన్నీ చేసినప్పుడు ఇక మీడియా ముందు వచ్చి ఎంత మొత్తుకుంటే ఏం లాభమని ప్రశ్నించింది.

మీటూ గురించి మాట్లాడడం వలనే తనకు అవకాశాలు లేకుండా పోయానని చెప్పుకొచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారు తనకు 'ఐస్ క్రీమ్ 2'లో ఛాన్స్ ఇచ్చారని.. ఆయన గురించి చాలా మంది చెప్పారు కానీ తనే స్వయంగా ఆయన ఎలాంటి వారో తెలుసుకోవాలని అనుకున్నానని.. ఆయనతో సినిమా చేయడమంటే మ్యారథాన్‌లో పాల్గొన్నట్లే ఉంటుందని.. మంచి వ్యక్తి అని తెలిపింది.

వయసులో తనకంటే పెద్దవారు అయిపోయారని లేదంటే వర్మని పెళ్లి చేసుకునేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఉంటే చాలనిపిస్తుందని అన్నారు. రీసెంట్ గా ఓ పార్టీలో వర్మని హగ్ చేసుకుంటే అది వైరల్ అయిందని.. ఆయనపై గౌరవం, అభిమానం ఉంది కాబట్టే హగ్ చేసుకున్నానని చెప్పింది.