జోకులు వేసేటప్పుడు కొంచెం జాగ్రతగా ఉండాలి. మిస్ మిస్ ఫైర్ అయితే విమర్శలు ఎదురవుతాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఆచి తూచి వ్యవహరించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారిని గమనిస్తూ ఉంటారు. తాజాగా ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు రోహిత్ రాయ్ చిక్కుల్లో పడ్డాడు. 

ఏకంగా రోహిత్ రాయ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పైనే జోక్ వేశాడు. దీనితో రజనీ అభిమానులకు మండింది. రోహిత్ ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ పై రోహిత్ రాయ్ నెటిజన్లకు సూచనలు తెలియజేస్తూ ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. 

సైకో వ్యభిచారి నువ్వా నేనా.. నీ వల్ల పవన్ బలయ్యాడు.. పూనమ్ పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

'రజనీకాంత్ కు కరోనా పాజిటివ్.. దీనితో కరోనా వైరస్ క్వారంటైన్ లోకి వెళ్ళింది' అని రోహిత్ రాయ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కి క్యాప్షన్ పెడుతూ.. చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ ఉపయోగించడం, పారిశుధ్య చర్యలు తీసుకోవడం మాత్రమే కరోనాని ఓడించడానికి ఆయుధాలు అని పేర్కొన్నాడు. 

ఇక రజనీకాంత్ ని ఇవాల్వ్ చేయడం వెనుక ఉద్దేశం.. ఎంత గొప్పవారైనా కరోనాకి అతీతం కాదని, ఎంత పెద్దవారికి కరోనా సోకినా.. వైరస్ కు ఏమీ కాదని అర్థం వచ్చేలా పరోక్షంగా ఆ పోస్ట్ పెట్టాడు. 

తనని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ పై రోహిత్ రాయ్ స్పందించాడు. నేను రజనీకాంత్ సర్ టిపికల్ స్టైల్ లో చిన్న జోక్ వేశాను. దీనికే ఆగ్రహానికి గురికావద్దు. నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి అని రోహిత్ రాయ్ రజనీ ఫ్యాన్స్ ని కోరాడు.