ప్రముఖ నటుడు సాయి కుమార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రవి శంకర్. 'అరుంధతి' సినిమాలో 'వదల బొమ్మాలీ వదలా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ని ఇప్పట్లో జనాలు మర్చిపోలేరు.

తాజాగా రవి శంకర్.. అలీ నిర్వహించే ఓ టీవీ షోకి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 3500 సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు.

అఫీషియల్ : 'మహానటి' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా!

'అరుంధతి'కి ముందు 'అరుంధతి'కి తరువాత మీ లైఫ్ ఎలా ఉందని ప్రశ్నించగా.. ''సాయి కుమార్ తమ్ముడిని కాబట్టి అప్పటివరకు అందరూ సాయి రవి అని పిలిచేవారు. కానీ 'అరుంధతి' సినిమా తరువాత 'బొమ్మాలీ' రవి శంకర్ అని పిలవడం మొదలుపెట్టారు'' అంటూ చెప్పుకొచ్చాడు.

కర్నాటకలో మిమ్మల్ని చూసి లేడీస్ భయపడతారంట కదా..? అని అలీ ప్రశ్నించగా.. ''థియేటర్ కి వెళ్లి సినిమా అయిన తరువాత నేను మా ఆవిడ పబ్లిక్ క్రౌడ్ లో వచ్చేస్తుంటే.. అక్కడున్న కొందరు లేడీస్ 'వీడితో ఎలాగమ్మా సంసారం చేస్తున్నావ్ నువ్..?'' అని అడిగారని నవ్వుకుంటూ చెప్పారు రవి శంకర్.

తనకో అలవాటు ఉందని.. బాత్రూంలోకి వెళితే గంటసేపటికి గానీ బయటకి రానని.. మొత్తం డైలాగ్స్, పెర్ఫార్మన్స్ లు అన్నీ అక్కడే అంటూ చెప్పగా.. దానికి అలీ 'అందుకేనేమో.. మొన్న బెంగుళూరులో ఇల్లు కొన్నాడు.. అందులో రెండు బెడ్ రూమ్ లు ఉన్నాయి కానీ ఐదారు బాత్రూమ్ లు ఉన్నాయంటూ' సెటైర్ వేశాడు.