బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై రీసెంట్ గా పబ్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిత్ రెడ్డి తన ఫ్రెండ్స్‌తో కలిసి పబ్ కి వెళ్లగా.. అదే పబ్ కి రాహుల్ తన ఫ్రెండ్స్ తో వెళ్లాడు.

అయితే రాహుల్ స్నేహితులతో రిషిత్ తప్పుగా ప్రవర్తించడంతో గొడవ మొదలైంది. ఈ గొడవలో రాహుల్ పై బీర్ బాటిల్స్ తో దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. ఈ విషయంపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాహుల్ సిప్లిగంజ్ మీద పబ్ లో దాడిపై నో కామెంట్: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ఇది ఇలా ఉండగా.. తాజాగా చీఫ్ విప్ వినయ భాస్కర్ తో  ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ లు భేటీ అయ్యారు. అసెంబ్లీ లో విప్ ఛాంబర్ లో ఈ మీటింగ్ చోటుచేసుకుంది. రాహుల్ కి అన్యాయం జరిగిందని.. పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదని ప్రకాష్ రాజ్ అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని చెప్పారు.

వినయ్ భాస్కర్ ని కలవడంలో ఈ కేసుకి సంబంధం లేదని.. కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్ ని కలవాల్సిన అవసరం లేదని అన్నారు. రాహుల్ తప్పు చేయనప్పుడు.. కాంప్రమైజ్ ఎందుకని ప్రశ్నించారు. ఇక రాహుల్ తనపై పబ్‌లో జరిగిన దాడి ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. ఫుటేజ్‌ను రిలీజ్ చేస్తూ తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ న్యాయం చేయాలని కోరారు.