ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఇటీవల మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వచ్చాయి. తమిళంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల మరో సీనియర్ నటి బయోపిక్ కు సన్నాహకాలు జరుగుతున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. 

ఆ బయోపిక్ చిత్రం మరెవరిదో కాదు.. గత ఏడాది మరణించిన నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల జీఎవిథ చరిత్రని వెండితెరపై ఆవిష్కరించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. 

తాగేసి సమంతపై ఆర్జీవీ ట్వీట్.. ఏం జరిగిందంటే..

విజయ నిర్మల పాత్రలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయనిర్మల తనయుడు, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. విజయనిర్మల బయోపిక్ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు వస్తున్న వార్తలని ఆయన ఖండించారు. 

నరేష్ మాట్లాడుతూ.. మా అమ్మ బయోపిక్ తెరకెక్కించడానికి ఎవ్వరికి హక్కులు ఇవ్వలేదు. అమ్మ బతికున్నప్పుడే తన బయోపిక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని నన్ను అడిగింది. అంతలో అమ్మ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అమ్మ బయోపిక్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఏడాది సమయం అయినా పడుతుంది. 

అమ్మ బయోపిక్ తెరెకెక్కిస్తే అందులో అమ్మ జీవితంలో అన్ని విశేషాలు ఉండాలి. అలాగే మా కుటుంబ సభ్యులని కూడా సంప్రదించాలి అని నరేష్ అన్నారు. ఇప్పట్లో విజయ నిర్మల బయోపిక్ సాధ్యం కాదని నరేష్ అన్నారు. విజయనిర్మల గత ఏడాది జూన్ లో మరణించారు. అత్యధిక చిత్రాలని తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ రికార్డ్ సాధించారు.