ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో 'ఛలో', 'జ్యోఅచ్యుతానంద' లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది. అమ్మాయిల కిడ్నాప్, హత్య లాంటి క్రైమ్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నాగ శౌర్య ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.

ఓ ఇంటర్వ్యూలో నాగ శౌర్య హీరోయిన్లతో తనకు ఎఫైర్లు ఉన్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించాడు. ముందుగా రాశిఖన్నా గురించి ప్రశ్నించగా.. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతోనే ఇద్దరం ఇండస్ట్రీకి పరిచయమయ్యామని.. ఇద్దరికీ మొదటి సినిమా కావడంతో మంచి స్నేహం ఉందని చెప్పారు.  

ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య!

అప్పుడప్పుడు బయట కలిసేవాళ్లమని.. ఐస్ క్రీమ్ కి వెళ్లేవాళ్లమని.. అంతకుమించి తనతో ఎలాంటి బంధం లేదని చెప్పారు. ఇక నీహారికతో పెళ్లి అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు.

2016 నుండి 2018 వరకు సినిమాలు చేయడం మానేశానని చెప్పిన శౌర్య.. ఆ సమయంలో 'ఛలో' సినిమా కోసం సిద్ధమవుతున్నామని.. అప్పుడు ఎవరికీ కనిపించలేదని.. దీంతో కొందరు తనకు సినిమాలు రావట్లేదని.. మరికొందరు పెళ్లి అయిపోయిందని వార్తలు పుట్టించారని.. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు కూడా కంగారు పడ్డారని చెప్పాడు.

ఆ గ్యాప్ లో వచ్చిన  రూమర్లే ఈ ఎఫైర్ వార్తలని.. నీహారికని తను పెళ్లి చేసుకోలేదని చెప్పారు. మరి ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా..? బయట అమ్మాయిని చేసుకుంటారా..? అని ప్రశ్నించగా.. ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానని బదులిచ్చాడు.

అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. తనకంటే ఇండస్ట్రీలో సీనియర్ చాలా మంది ఉన్నారని.. నితిన్, ప్రభాస్, రోహిత్, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది ఉన్నారని వాళ్లు పెళ్లి చేసుకున్న తరువాత చేసుకుంటానని చెప్పారు.