టీవీ నటుడు కుశాల్ పంజాబీ(37) మరణవార్త హిందీ టెలివిజన్ పరిశ్రమని షాక్ కి గురి చేసింది. చిన్న వయసులోనే కుశాల్ మరణించడం ఆయన కుటుంబసభ్యులను, తోటి నటులను శోకసంద్రంలో ముంచేసింది. 'జోర్ కా జట్కా' అనే రియాలిటీ షోతో కుశాల్ ఫేమస్ అయ్యాడు.

'ఫియర్‌ ఫాక్టర్‌', 'నౌటికా నావిగేటర్స్‌', 'ఝలక్‌ దిఖ్లా జా' వంటి రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేగాకుండా 'ఫర్హాన్‌ అక్తర్‌ లక్ష్యా', 'కరణ్‌ జోహార్‌ కాల్‌' సినిమాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు. గురువారం రాత్రి కుశాల్ పంజాబీ తన నివాసంలో మరణించాడు.

''వయసులో నాకేంటే చిన్న.. కానీ డేట్ కి పిలిచాడు''

మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన మరణించి ఉంటాడని భావిస్తున్నారు. బాంద్రాలోని తన నివాసంలో ఆయన ఉరివేసుకుని కనిపించినట్టు స్పాట్‌బాయ్ వెల్లడించడంతో ఈ వార్త ఒక్కసారిగా గుప్పుమంది. కుషల్ పంజాబీ మృతిని ఆయన సన్నిహిత మిత్రుడు కరణ్‌వీర్ బోహ్రా ధ్రువీకరించారు.

దీనిపై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కరణ్‌ పోస్టుతో అతడి మరణ వార్తను తెలుసుకున్న సెలబ్రిటీలు షాక్‌కు గురవుతున్నారు. కుశాల్‌ ఆకస్మిక మృతికి గల కారణాలు తెలియరాలేదు.

2015 నవంబర్‌లో వివాహం చేసుకున్న కుశాల్ కి కియాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.