తనకంటే వయసులో చిన్నవాడైన ఓ వ్యక్తి తనను డేట్ కి పిలిచినట్లు బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కొన్ని కామెంట్స్ చేసింది. దక్షిణాది చిత్రాలతో పాటు.. పలు బాలీవుడ్ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

తాజాగా ఆమె నెట్ ఫ్లిక్స్ కి సంబంధించిన ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. ఆ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో తన భర్తతో మొదటిసారి డేట్ కి వెళ్లడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది.

ముదురు భామలతో కుర్ర హీరోల ఘాటు రొమాన్స్!

ఒకానొక సమయంలో ఇద్దరు అబ్బాయిలు తనను డేట్ కి పిలిచిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది. అందులో ఒకరు తనకంటే వయసులో చిన్నవాడని.. ఇద్దరూ ఒకేరోజు, ఒకే సమయానికి డేట్ కి పిలిచారని ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదని చెప్పింది. అప్పుడు తన ఇంటికి రోజూ ఓ పిల్లి వస్తుండేదని.. దానికి ఓ చేప పిల్లని ఆహారంగా అందించేవాళ్లమని చెప్పింది.

ఇద్దరు తనను డేట్ కి పిలిచినప్పుడు.. ఇంటికి వెళ్లి పిల్లికి చేపని ఆహారంగా అందించానని.. ఒకవేళ అది తింటే ఒక అబ్బాయితే.. తినకపోతే తనకంటే చిన్నవాడితో డేట్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆ రోజు పిల్లి చేపని తినడంతో ఒక అబ్బాయితో డేట్ కి వెళ్లానని.. తరువాత అతడినే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది.