ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యం దెబ్బ తిందని.. బుదవారం రాత్రి ఆయన అస్వస్థతకి గురి కావడం బంజారాహిల్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు.. ఐసీయులో చికిత్స అందిస్తున్నట్లు నిన్న కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కృష్ణంరాజు ఖండించారు.

సీనియర్ రెబెల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కి తీవ్ర అస్వస్థత

ఆయన మాట్లాడుతూ.. "కేవలం న్యూమోనియా కు చికిత్స చేయించుకోవడంతో పాటురెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్ళటం చూసిన కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాశారు. ఇందువల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్స్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. నా ఆరోగ్యం విషయంగా ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు'' అన్నారు.