చెన్నై : తమిళంలో కొన్ని సినిమాలు, సీరియల్స్ లో నటించిన నటి పి.పద్మ (23) ఆదివారం నాడు తిరువొట్టియుర్ లోని తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. ఇంట్లో పద్మ ఒంటరిగా జీవిస్తుందని.. రెండు నెలల క్రితం తన భర్త పవన్ (25)తో కలిసి ఇంటిని అద్దెకి తీసుకుందని పోలీసులు తెలిపారు.

ఆమె రెండేళ్ల కొడుకు బంధువుల ఇంట్లో పెరుగుతున్నాడని.. పద్మ, పవన్ లు తమ బిడ్డను చూడడానికి ప్రతీ వారం వెళ్తుంటారని పోలీసులు తెలిపారు. నెల రోజుల క్రితం పద్మ తన భర్తతో విడిపోయిందని.. భార్యతో గొడవ పడ్డ పవన్ ఆంధ్రప్రదేశ్ కి వెళ్లిపోయాడని తెలుస్తోంది.

స్టార్ హీరోని ముద్దాడిన విజయ్ సేతుపతి.. ఫోటో వైరల్!

పోలీసుల విచారణలో పద్మ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని తెలిసింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పద్మ తన సోదరికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఆర్ధిక కష్టాల్లో ఉన్నానని.. సరైన పాత్రలు చేయలేకపోతున్నానని తన సోదరితో చెప్పుకొని బాధ పడిందట. 

ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని పద్మ ఇంటి తలుపులు వేసి ఉండడం, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు.

పద్మ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమె ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి వెళ్లి చూడగా.. అప్పటికే పద్మ ఉరేసుకొని చనిపోయి ఉంది. ఆమె భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.