యువ దర్శకులు చాలా తెలివిగా ఉంటున్నారు. చాలా స్ట్రాటజీగా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో లాగ ఒకే హీరోని పట్టుకుని ఏళ్ల తరబడి వాళ్ల డేట్స్ కోసం ఎదురుచూస్తూ అదే క్యాంప్ లో జీవితం గడపటం లేదు. నలుగురైదురు హీరోలకు ఒకే సారి కథ చెప్పి...ఎవరు ముందు ఓకే అంటే వాళ్లతో ముందుకు వెళ్లిపోతున్నారు. జెర్శితో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి కూడా ప్రస్తుతం అదే పనిచేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

బాబాయ్, అబ్బాయిలు ఇధ్దరినీ టార్గెట్ చేస్తూ ఇద్దరికీ కథ చెప్పారని తెలుస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్‌ రీసెంట్ గా పవన్‌కు స్టోరీ వినిపించారని.. ఆయనకు స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా చేద్దాం కానీ.. ఇప్పుడైతే కష్టం అని, టైం పడుతుందని  జనసేనాని తేల్చిచెప్పినట్లు సమాచారం. దాంతో పవన్ ని మెప్పించాం కదా అనే ఉత్సాహంలో స్టోరీ డెవలప్ చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారట. ఆ తర్వాత ఆ విషయం తెలిసిన రామ్ చరణ్ ఆ కథ వినాలని ఉత్సాహం చూపించారని సమాచారం.

జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

దాంతో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను కలిసి అదే కథ వినిపించాడట. స్టోరీ లైన్ బాగుందీ కానీ.. బాబాయ్ ఇమేజ్ తగ్గట్లుగా ఉంది...నా కోసం వేరే స్టోరీ లైన్ ఉంటే చెప్పు అన్నారట. అయితే చిన్న చిన్న మార్పులతో చెర్రీతో ఆ కథ చేయచ్చని, వెర్షన్ రాసుకొచ్చి వినిపిస్తానని గౌతమ్ అన్నారట. దాంతో ఆ స్క్రిప్టు కనుక నచ్చితే కనుక...ఆర్ ఆర్ ఆర్ తర్వాత అదే ఉండవచ్చని అంటున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్` సినిమాతో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన తన తండ్రి సినిమాలో నటిస్తారు. ఆ తర్వాత సుజీత్ తో  సినిమా చేస్తాడని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా, త్రివిక్రమ్… ఇలా వరస దర్శకులతో సినిమాలు చేసే ఆలోచనలతో  చరణ్ ఉన్నారట. మరో ప్రక్క గౌతమ్ ప్రస్తుతం హిందీలో జెర్సీని రీమేక్ చేస్తున్నారు. రామ్ చరణ్ తో ఆయన సినిమా ఓకే అయ్యిందంటే మాత్రం అది ఇంట్రస్టింగ్ కాంబినేషన్ అవుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.