హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ స్టూడియోస్, మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఫ్రోజెన్ 2’. 2013లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఫ్రొజెన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఫ్రోజెన్ 2’ తెరకెక్కింది.
కొద్ది కాలం క్రితం వరకూ హాలీవుడ్ సినిమా డబ్బింగ్ వెర్షన్ అంటే అది ఖచ్చితంగా యాక్షన్ సినిమానో లేక శృంగార చిత్రమో అయ్యిండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. హాలీవుడ్ లో వచ్చే యానిమేషన్ సినిమాలు సైతం తెలుగులో రిలీజ్ అవుతున్నాయి.ముఖ్యంగా డబ్బింగ్ అయ్యి వచ్చే పిల్లలు సినిమాలు వీకెండ్ లో బాగా కలెక్ట్ చేస్తున్నాయి. అందుకే స్టార్స్ తో డబ్బింగ్ చెప్పించి మరీ లోకల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది హాలీవుడ్. తాజాగా ‘ఫ్రోజెన్ 2’సినిమాని సైతం మన రీజనల్ లాంగ్వేజ్ లలో డబ్ చేసి భారతదేశమంతటా భారీగా వదిలారు.
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ స్టూడియోస్, మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఫ్రోజెన్ 2’. 2013లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఫ్రొజెన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఫ్రోజెన్ 2’ తెరకెక్కింది.
రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి.. ఏడ్చేసిన హీరో!
ఎలాంటి దాన్నైనా సరే మంచుగడ్డగా మార్చేసే అద్భుత శక్తులున్న యువరాణి ఎల్సా. ఆమె ముద్దుల చెల్లెలు అన్నా, తుంటరి చేష్టలతో నవ్వించే మంచు మనిషి ఓలఫ్.. వీళ్ళంత కలిసి ఆరేళ్ల క్రితం వచ్చిన ‘ఫ్రోజెన్’ చేసి పిల్లలను తెగ నవ్వించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ డాలర్లు రాబట్టింది. మళ్లీ ఇంతకాలం తర్వాత ‘ఫ్రోజెన్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘ఫ్రోజెన్ 2’ విడుదలైంది. తెలుగులో ఎల్సా పాత్రకు నిత్యా మేనన్, చిన్నప్పటి ఎల్సాగా మహేశ్‌బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పారు. అయితే తన కోసం సినిమాకు వెళ్లిన అభిమానులకు నిరాశే. సితార పాప డబ్బింగ్ కాసేపు మాత్రమే వినపడుతుంది.
ఓలఫ్ పాత్రకు నటుడు ప్రియదర్శి డబ్బింగ్ చెప్పడంతో చిత్రంపై ఇంట్రస్ట్ పెరిగింది. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. దీంతో ఆ పాత్ర ని అందరూ ఇష్టపడతారు. డిస్నీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. దర్శకుల పనితనం నచ్చుతుంది.మరి ఈ సినిమా ఏ మేరకు వర్కవుట్ అయ్యింది? సాహసాలతో అలరించాయా? అంటే ట్రేడ్ లో లెక్కలు చూడాలి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఇప్పుడు ఇండియాలో మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.ఫస్ట్ వీకెండ్ లోనే ఫ్రోజెన్ 2 అదరగొట్టింది. అయితే ఆ తర్వాత కాస్త డల్ అయ్యింది. మరీ ముఖ్యంగా సినిమాలో పాటలు ఎక్కవ అవటంతో విసిగించింది. మొదటి మూడు రోజులకే దాదాపు 18 కోట్లను కొల్లగొట్టింది ఫ్రోజెన్ 2. వీక్ డేస్ లో డ్రాప్ కనిపించింది. మొత్తంగా ఇప్పటివరకూ 25 కోట్ల రూపాయల షేర్ ను దాటింది ఫ్రోజెన్ 2.
