Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ విషయాన్ని దాయలేదు.. స్టార్ హీరో కూతురి కామెంట్స్!

ఈ విషయం గురించి మాట్లాడిన ఐరా తన ప్రేమ విషయాన్ని దాచాలనుకోవడం లేదని.. అలా అని బహిర్గత పరచాలని కూడా అనుకోవడం లేదని వెల్లడించింది. మీరు ఎవరితోనైనా.. రిలేషన్ లో ఉన్నారా..? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి బదులుగా.. మిషాల్ ని హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశారు ఐరా.

Aamir Khan Daughter Ira On Dating Mishaal Kirpalani
Author
Hyderabad, First Published Jan 16, 2020, 4:26 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఐరా ఖాన్ చాలా రోజులుగా మ్యూజిక్ కంపోజర్ మిషాల్ కృపలానీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి మాట్లాడిన ఐరా తన ప్రేమ విషయాన్ని దాచాలనుకోవడం లేదని.. అలా అని బహిర్గత పరచాలని కూడా అనుకోవడం లేదని వెల్లడించింది.

మీరు ఎవరితోనైనా.. రిలేషన్ లో ఉన్నారా..? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి బదులుగా.. మిషాల్ ని హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశారు ఐరా. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. 'నేను డీ దాయాలనే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో నాకు నచ్చిన పోస్ట్ లు పెడతాను. ఫోటోలు షేర్ చేశాను. నేను ఏంటీ అనే నిజాన్ని ప్రతిబింబించేలా నా పోస్ట్ లు ఉంటాయి' అని చెప్పుకొచ్చింది.

ఆ వీడియోలో ఉన్నది నేనే.. పాక్ హీరోయిన్ గట్టి కౌంటర్!

అలానే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బట్టి తన ప్రవర్తన ఉంటుందని తెలిపింది. త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ థియేటర్ ద్వారా డైరెక్టర్ గా ఆమె మెగాఫోన్ పట్టనున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

ఇండస్ట్రీలోకి ఎంటర్ కాకముందే తన డ్రెస్సింగ్, బాయ్ ఫ్రెండ్ అంటూ తరచూ ఈ స్టార్ కిడ్ వార్తల్లో నానుతూనే ఉంది. ఆమిర్ మొదటి భార్య రీనా దత్తా కూతురే ఐరా ఖాన్. ప్రస్తుతం ఐరా తన తల్లి, సోదరుడితో కలిసి జీవిస్తోంది.  

Aamir Khan Daughter Ira On Dating Mishaal Kirpalani
 

Follow Us:
Download App:
  • android
  • ios