పాకిస్తాన్-కెనడియన్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త తారీక్ ఫతా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ కి చెందిన ఓ తల్లి తన పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అనుమతించలేదని పేర్కొంటూ తారీక్ ఓ వీడియో షేర్ చేశారు.

పోలియో వర్కర్ల ముఖం మీద ఓ పాకిస్తాన్ తల్లి తలుపులు వేసేసిందని, మహిళా కార్యకర్తలపై కేకలు వేసిందని, తన పిల్లలకు పోలియో చుక్కలు వేయనివ్వడం లేదని.. పాకిస్తాన్ లోని పరిస్థితుల గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

చీరలో సెక్సీ లుక్ తో చంపేస్తున్న ఛార్మీ..!

ఈ క్రమంలో తారీక్ ట్వీట్ పై స్పందించిన పాకిస్తాన్ హీరోయిన్ మేవిష్ హయత్ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏదైనా వీడియో షేర్ చేసే ముందు ఆలోచించుకోవాలని.. 
ఆ వీడియో బైట్ తన 'లోడ్ వెడ్డింగ్' సినిమాలో ఓ సీన్ అని.. అందులో తను పోలియో వర్కర్ గా నటించినట్లు చెప్పింది.

తనపై అరుస్తున్న మహిళ కూడా నటేనని.. పోలియో చుక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం కోసం ఆ సీన్ లో నటించిందని వెల్లడించింది. దీంతో తారీక్ తన పోస్ట్ ని డిలీట్ చేశాడు.

అయితే అప్పటికే నెటిజన్లు ఈ పోస్ట్ చూడడంతో ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్‌ సంతతికి చెందిన తారీక్‌ ఫతా కెనడాలో జీవిస్తున్నారు. ముస్లిం ఇండియన్‌ కాంగ్రెస్‌ను స్థాపించి.. దానికి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.