Asianet News TeluguAsianet News Telugu

విజయ దేవరకొండ పేరుతో టైటిల్, వర్కవుట్ అవుతుందా..?

వివరాల్లోకి వెళితే...విజయ్ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం 'దేవరకొండలో విజయ్ ప్రేమకథ' . ఈ చిత్రం పోస్టర్‌ను రీసెంట్ గా హీరో శ్రీకాంత్‌ ఆవిష్కరించారు.  మరి ఈ సినిమా వాళ్లు ఈ టైటిల్ తో ఎంతవరకూ దేవరకొండ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటారో చూడాల్సిందే.

A new movie titled Devarakonda lo Vijay Prema katha
Author
Hyderabad, First Published Nov 1, 2019, 9:39 AM IST

క్రేజ్ లో ఉన్న స్టార్స్ పేర్లు వాడేయటం సినిమావాళ్లకు కొత్తేమీ కాదు. గతంలో  చిరంజీవి  క్రేజ్ వాడుకుంటూ ‘మా నాన్న చిరంజీవి’ అని.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను గుర్తు  చేస్తూ ‘డాటరాఫ్ వర్మ’ అని  సినిమాలొచ్చాయి. అయితే అవి ఆడాయా లేవా అన్న సంగతి ప్రక్కన పెడితే కొద్దిగా మార్కెట్ లో బజ్ క్రియేట్ చేసాయి. చిన్న సినిమాకు ఆ మాత్రం ఊపు చాలు అని భావించే దర్శక, నిర్మాతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూంటారు.

ట్విట్టర్ టాక్: మీకు మాత్రమే చెప్తా

తాజాగా విజయ్ దేవరకొండ పేరుని , ఆయన కు క్రేజ్ ని క్యాష్ చేసుకునే దిశగా ఆయన పేరు కలిసివచ్చేలా టైటిల్ ని వదిలారు. అయితే ఆ ప్రయత్నంలో కొంతవరకూ సక్సస్ అయ్యినట్లే. ఎందుకంటే ఆ టైటిల్ కనుక పెట్టకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకునేటంత విషయం ఉన్న సినిమా కాదు అది.

వివరాల్లోకి వెళితే...విజయ్ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం 'దేవరకొండలో విజయ్ ప్రేమకథ' . ఈ చిత్రం పోస్టర్‌ను రీసెంట్ గా హీరో శ్రీకాంత్‌ ఆవిష్కరించారు.  మరి ఈ సినిమా వాళ్లు ఈ టైటిల్ తో ఎంతవరకూ దేవరకొండ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటారో చూడాల్సిందే.

 శ్రీకాంత్ మాట్లాడుతూ 'మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమాకు అపజయమంటూ ఉండదు. ఈ సినిమా టైటిల్‌ కూడా చాలా బాగుంది. ఇందులో నటించిన హీరో విజయ్ శంకర్‌ అందంగా ఉన్నాడు. నూటికినూరు శాతం విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను. యంగ్‌స్టర్స్‌తో సినిమా రూపొందించడం విశేషం'' అని అన్నారు.

‘‘మేం అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. బడ్జెట్‌లో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. శ్రీకాంత్‌గారి చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించడం మా విజయానికి మొదటి మెట్టుగా భావిస్తున్నాం’’ అన్నారు నిర్మాత వడ్డాన మన్మథరావు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. కథను నమ్ముకునే ఈ ప్రాజెక్టు చేపట్టాం. హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకటరమణ.  ‘‘ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. అన్నీ చాలా  బాగుంటాయి’’ అన్నారు సంగీత దర్శకుడు సదాచంద్ర. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌ సంతోష్‌. ఎస్‌.

Follow Us:
Download App:
  • android
  • ios