యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' నేడు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే  విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమాను యువ టెక్నీషియన్స్ తెరకెక్కించారు. ఇక సినిమా ప్రీమియర్స్ పై లుక్కేసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

సినిమాలో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని మెయిన్ గా తరుణ్ భాస్కర్ యాక్టింగ్ చాలా బావుందని కామెంట్స్ చేస్తున్నారు,. ఇక యువ కమెడియన్ అభినవ్ కూడా మారోసారి తన కామెడీ టైమింగ్ తో మంచి కిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కథకు తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావున్నాయి. సినిమా కథ కూడా నేటితరానికి బాగా దగ్గరగా ఉంటుంది.

నటీనటుల యాక్టింగ్ స్కిల్స్ సినిమాలో చక్కగా ప్రజెంట్ చేశారని టాక్ వస్తోంది.  ఇక ఫస్ట్ హాఫ్ డీసెంట్ కొనసాగగా క్లయిమ్యాక్స్ లో ట్విస్ట్ కూడా ఓ వర్గం ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయని తెలుస్తోంది. పెళ్లి సీన్స్ తో పాటు హీరోయిన్ ఎపిసోడ్స్ బాగా నవ్విస్తాయని చెబుతున్నారు. మొత్తంగా తరుణ్ భాస్కర్ - అభినవ్ కాంబినేషన్ సినిమాలో మంచి కామెడీ రైడ్ ని ఎలివేట్ చేసిందని చెబుతున్నారు. అనసూయా క్యారెక్టర్ కూడా సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది.

ఫైనల్ సినిమా ఈ వీకెండ్ లో మంచి ఫీల్ ని కలిగించే కామెడీ ఎంటర్టైనర్ గా నిలవనున్నట్లు టాక్ వస్తోంది. .  ఇప్పటికే సినిమాను పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. యూఎస్ లో ప్రీమియర్ షోలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ వారం మీకు మాత్రమే చెప్తా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. దర్శకుడు శమ్మిర్ సుల్తాన్ తన పనితోనే అందరిని ఎట్రాక్ట్ చేశాడు. అతని మేకింగ్ స్టైల్ బావుందని సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.