ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతి సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటాడు. చిన్న సినిమా అయినా.. మొదటి నుండి సరైనప్రమోషన్స్ చేసుకుంటూ ఆ సినిమా జనాల్లో ఉండేలా చూసుకుంటాడు. అతడు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు కూడా క్రేజ్ వస్తుంటుంది. కానీ దిల్ రాజు తన సొంత బ్యానర్ లో తెరకెక్కుతోన్న '96' సినిమా విషయంలో 
మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నాడు.

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టలేదు. కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం లేదు. దిల్ రాజు '96' సినిమాను తమిళంలో చూసి ఎంతో ఇష్టంగా రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. ఒరిజినల్ డైరెక్టర్ ని తీసుకొచ్చి.. శర్వానంద్-సమంతల కాంబినేషన్ లో సినిమా మొదలుపెట్టాడు. 

నోటి దురద.. అడ్డంగా బుక్కైన స్టార్స్!

సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఆ విషయం కూడా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. అప్పటికి గానీ జనాలకు ఈ సినిమా ఒకటి షూటింగ్ జరుగుతోందని గుర్తురాలేదు. నిజానికి దిల్ రాజు ప్లాన్ ఏంటంటే ఈ సినిమాను డిసంబర్ 20లేదా 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి చాలా సినిమాలు రిలీజ్ కి ఉండడంతో తన సినిమాని ఆ రేస్ నుండి తప్పించాడు.

దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తాడని భావించారు. కానీ అదే సమయంలో 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ పెట్టుకోవడంతో సంక్రాంతిస్లాట్ దొరకలేదు. దిల్ రాజు '96' విషయంలో ఇంత సైలెంట్ గా ఉండడంతో ఇక సినిమాను ఫిబ్రవరి లేదా వేసవికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ మధ్య శర్వానంద్ మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. అందుకే సరైన సమయం కోసం ఎదురుచూసి సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.