కోలీవుడ్ లో మరోసారి ఐటీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. కోలీవుడ్ నటుడు విజయ్, అన్బు చెలియన్ కు చెందిన 38 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వారు రూ.65 కోట్లను స్వాదీం చేసుకున్నారు.

ఇంకా లెక్కలు తేలలేదని సమాచారం. గతేడాది విడుదలైన 'బిగిల్' సినిమాకి సంబంధించి పన్ను ఎగవేశారనే ఆరోపణలతో విజయ్ నివాసాలతో పాటు ఈ చిత్రాని తెరకెక్కించిన ఏజీఎస్ సంస్థ కార్యాలయాలు, సంస్థకి చెందిన వ్యక్తుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హీరో విజయ్ ని బీజేపీ టార్గెట్ చేసిందా..? రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్

అన్బు చెలియన్ కి చెందిన సంస్థలు, మదురైలోని ఆయన నివాసంలో కూడా ఈ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో రూ.65 కోట్ల సొమ్ముని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉదయాన్నే విజయ్ ఇంటికి చేరుకున్న ఆఫీసర్స్ నిర్విరామంగా విజయ్ ని విచారిస్తున్నారు.

ఈ క్రమంలో విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. బీజేపీ కావాలని హీరోని టార్గెట్ చేసిందని చెబుతున్నారు. గతంలో మూడు సార్లు విజయ్ సినిమాల్లో బీజేపీ కి కౌంటర్ ఇచ్చే విధంగా డైలాగ్స్ చెప్పారు.   ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.